Posts

Showing posts from December, 2018

నీలకంధరా దేవా

జయ జయ మహాదేవ శంభో సదాశివా... ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా... పల్లవి : నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా ||2|| సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ ||2|| ||నీలకంధరా|| చరణం 1 అన్యదైవము గొలువా... అన్యదైవము గొలువా నీదుపాదము విడువా ||2|| దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా ||2|| ||నీలకంధరా|| చరణం 2 దేహియన వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడు పరంధామా నీయమమున నీ దివ్యనామ సంస్మరణా ఏమారక చేయుదును భవతాపహరణా నీ దయామయ దృష్టి దురితమ్ములార వరసుధావృష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాసభాసా హరహర మహాదేవ కైలాసవాసా... కైలాసవాసా ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా ||2|| కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ||2|| ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||2|| ||ఫాలలోచన|| శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ||3|| సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం రచన : సముద్రాల గానం : ఘంటసాల

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్ మహోంకార రూపమ్ శివమ్ శివమ్ మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్ పవిత్రమ్ మహా గాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రమ్ మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్ భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్ ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ న మశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ మహ ప్రాణదీపమ్ - శివమ్, శివమ్ భజే మంజునాధమ్ - శివమ్, శివమ్ అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్ త్రిదశ హృదయంగమమ్ -చతురుదధి సంగమమ్ పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్ సప్తస్వరేశ్వరమ్ - అష్టసిద్దీశ్వరమ్ నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్ ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్ ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్ ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్ భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్ ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్ నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్ మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్ మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్ ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ పురహరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ మహ ప్రాణదీపమ్-శివమ్, శివమ్ భజేమంజునాధమ్-శివమ్, శివమ్ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢం...

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

తమ: ప్రకాశా తరుణేందుభూషా నమో....శంకరా దేవదేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా "మహేశా" భక్తి యేదో పూజలేవో తెలియనైతినే "భక్తి" పాపమేదో పుణ్యమేదో కాననైతినే "మహేశా" చ: మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా "మంత్ర" మంత్రమో తంత్రమో ఎరుగనే నాదమేదో - వేదమేదో తెలియనైతినే "నాద" వాదమేల పేదబాధ తీర్చరావయ్యాస్వామి "మహేశా" చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్చగరావయ్య దీటుగనమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్యా (2)

నమో భూతనాథ నమో దేవదేవ -సత్య హరిశ్చంద్ర

హరిశ్చంద్రుడు: హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప హరిశ్చంద్రుడు: నమో భూతనాథ నమో దేవదేవ నమోభక్తపాల నమో దివ్యతేజా హరిశ్చంద్రుడు, చంద్రమతి: నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా నమో భూతనాథ హరిశ్చంద్రుడు: భవా వేదసారా సదా నిర్వికారా భవా వేదసారా సదా నిర్వికారా జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠా హరిశ్చంద్రుడు, చంద్రమతి: నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా నమో భూతనాథ చంద్రమతి: సదా సుప్రకాశా మహాపాపనాశా ఆ.... సదా సుప్రకాశా మహాపాపనాశా కాశీ విశ్వనాథా దయాసింధువీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠా హరిశ్చంద్రుడు, చంద్రమతి: నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా నమో భూతనాథ చిత్రం : సత్య హరిశ్చంద్ర (1965) సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు రచన : పింగళి నాగేంద్ర రావు గానం : ఘంటసాల, ఎస్.వరలక్ష్మి

Om Sri Vinayaka Namha