నమో భూతనాథ నమో దేవదేవ -సత్య హరిశ్చంద్ర


హరిశ్చంద్రుడు:
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో
గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప

హరిశ్చంద్రుడు:
నమో భూతనాథ నమో దేవదేవ
నమోభక్తపాల నమో దివ్యతేజా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ

హరిశ్చంద్రుడు:

భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ

చంద్రమతి:
సదా సుప్రకాశా మహాపాపనాశా ఆ....
సదా సుప్రకాశా మహాపాపనాశా కాశీ విశ్వనాథా
దయాసింధువీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠా
హరిశ్చంద్రుడు, చంద్రమతి:
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ

చిత్రం : సత్య హరిశ్చంద్ర (1965)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : పింగళి నాగేంద్ర రావు
గానం : ఘంటసాల, ఎస్.వరలక్ష్మి

Comments

Popular posts from this blog

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్