ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్

మహోంకార రూపమ్ శివమ్ శివమ్

మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్

పవిత్రమ్ మహా గాఢ

తిమిరాంతకమ్ సౌరగాత్రమ్

మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్

భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్

ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ న

మశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ

మహ ప్రాణదీపమ్ - శివమ్,

శివమ్ భజే మంజునాధమ్ - శివమ్,

శివమ్ అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్

త్రిదశ హృదయంగమమ్ -చతురుదధి సంగమమ్

పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్

సప్తస్వరేశ్వరమ్ - అష్టసిద్దీశ్వరమ్

నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్

ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్

ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం

దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్

ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్

భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్

ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్

నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్

మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్

మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్


ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ

పురహరాయచ రుద్రాయచ భద్రాయచ

ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ

మహ ప్రాణదీపమ్-శివమ్,

శివమ్ భజేమంజునాధమ్-శివమ్,

శివమ్ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢక్కా నినాద నవతాండవాడంబరమ్ తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంభరమ్

ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార

మంత్ర బీజాక్షరమ్ మంజునాధేశ్వరమ్

ఋగ్వేద మాద్యమ్ -యజుర్వేదవేద్యమ్ సామప్రగీతమ్ - అధర్వ ప్రభాతమ్ పురాణేతిహాస ప్రసిద్దమ్ విశుద్దమ్ ప్రపంచైక సూత్రమ్ - విబుద్ధమ్ సుసిద్ధమ్ నకారమ్ మకారమ్ - శికారమ్ వకారమ్ యకారమ్ నిరాకార సాకార సారమ్ మహాకాల కాలమ్ మహానీల కంఠమ్ - మహనంద నందమ్ మహట్టాట్ట హాసమ్ జటాజూట రంగైక గంగా సుచిత్రమ్ జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్ మహాకాశ భాస్వన్మహాభానులింగమ్ మహాబభ్రు వర్ణమ్ సువర్ణమ్ ప్రవర్ణమ్ సౌరాష్ట్ర సుందరమ్ - సోమనాథేశ్వరమ్ శ్రీశైల మందిరమ్ - శ్రీమల్లికార్జునమ్ ఉజ్జయిని పుర - మహాకాళేశ్వరమ్ వైధ్యనాధేశ్వరమ్ -మహాభీమేశ్వరమ్ అమరలింగేశ్వరమ్ రామలింగేశ్వరమ్ -కాశీవిశ్వేశ్వరమ్ పరమ్ ఘృశ్మేశ్మరమ్ త్ర్యయంబకాధీశ్వరమ్ - నాగలింగేశ్వరమ్ శ్రీ కే్దారలింగేశ్వరమ్ అప్లింగాత్మకమ్ - జ్యోతిలింగాత్మకమ్ వాయు లింగాత్మకమ్ - ఆత్మ లింగాత్మకమ్ అఖిల లింగాత్మకమ్ - అగ్ని సొమాత్మకమ్ అనాదిమ్ అమేయమ్ అజేయమ్ అచింత్యమ్ అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్ // అనాదిమ్ // ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్ ఓమ్ సోమాయచ - సౌమ్యాయచ భవ్యాయచ - భాగ్యాయచ శాంతాయచ - శౌర్యాయచ యోగాయచ - భోగాయచ కాలాయచ - కాంతాయచ రమ్యాయచ - గమ్యాయచ ఈశాయచ - శ్రీ చాయాయచ శర్వాయచ - సర్వాయచ

Comments

Popular posts from this blog

నమో భూతనాథ నమో దేవదేవ -సత్య హరిశ్చంద్ర